calender_icon.png 5 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చతుర్ముఖ పోటీ.. చూడముచ్చటైన పోటీ

05-12-2025 12:00:00 AM

ఎర్రుపాలెం డిసెంబర్ 4 ( విజయ క్రాంతి):ఎర్రుపాలెం మండలంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3వ తేదీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వివిధ గ్రామాలలో పోటీ అనివార్యమైంది. మండలంలో 31 గ్రామపంచాయ తీలు ఉండగా అందులో ఆరు గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాయి. మిగి లిన గ్రామపంచాయతీలకు పోటీ అనివార్యమైంది.మండల కేంద్రంలో జరిగే గ్రామపం చాయతీ పోటీ లో చతుర్ముఖ పోటీ చూడముచ్చటగా ప్రజలకు కనువిందుగా ఉన్నది.

కాంగ్రెస్ నుండి ఇద్దరు అభ్యర్థుల పోటీ చే యుగా మిగిలిన ఇద్దరూ ఇతర పార్టీల బలపరిచిన అభ్యర్థులు పోటీలో మొత్తం నలు గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గ్రామంలో పోటా పోటీగా ప్రచారం మొదలుపెట్టారు. మండలంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం నుండి ఒక అభ్యర్థి వేరొక వర్గం నుండి ఒక అభ్యర్థిని మండల కేంద్రం లో పోటీ చేయడంతో ప్రజలు ఎన్నికను ఆసక్తిగా గమనిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి ఒక వర్గం తరపున నండ్రు అశ్విని ఉంగరం గుర్తుతో పోటీలో ఉండగా, వేరొక వర్గం తరఫున గుడేటి స్వాతి బాల్ గుర్తుతో పోటీలో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో బి ఆర్ ఎస్ పార్టీ తరఫున సిపిఎం బలపరిచిన అభ్యర్థి ఉప్పు కనకదుర్గ కత్తెర గుర్తుతో పోటీలో ఉన్నారు. మరొక అభ్యర్థి బిజెపి పార్టీ బలపరిచిన దేవరకొండ అనిత బ్యాట్ గుర్తుతో బరిలో నిలిచారు.

దీనితో ఎర్రుపాలెం మండల కేంద్రంలో చతుర్ముఖ పోటీ అనివారమైంది. కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీలుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బిఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ప్రచారాన్ని మొదలుపెట్టారు. బిజెపి బలపరిచిన అభ్యర్థిని కూడా ప్రచారంలో ఉండడంతో గ్రామ ఓటర్లు ఓటుని ఎవరికి వేయాలో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.

పంచాయతీ ఎన్నికల్లో యువత ఎక్కువమంది గ్రామంలో పోటీ పడడంతో మండల కేంద్రంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. గతంలో ఇద్దరు అభ్యర్థుల నుండి మాత్రమే పోటాపోటీగా ఎన్నికలు జరిగేవి. కానీ ఈ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు తగ్గేది లే అనుకుంటూ ఎవరికి వారే ప్రచారం నిర్వహించుకుంటూ గెలుపు ధీమాపై ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ,ర్యాలీలు ,ఇంటింటి ప్రచారాలు మొదలు పెట్టారు.

ఈ చతుర్ముఖ పోటీలో అభ్యర్థులు పోటా పోటీలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో జరిగే ఈ ఎన్నిక పై మండల వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. చివరికి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.