calender_icon.png 5 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయింపులు షురూ..

05-12-2025 12:00:00 AM

ఇల్లందు మండలంలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి.. 

ఇల్లెందు, డిసెంబర్ 4, (విజయక్రాంతి): ఇల్లందు మండలంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగం గా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు ఆశించి రాని నాయకులు పా ర్టీ ఫిరాయింపులకు దిగుతున్నారు. గడిచిన రెండు రోజులుగా మండల వ్యాప్తంగా బి. ఆర్.ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి మారుతున్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదివాసి నాయకుడు న్యాయవాది సూర్ణపాక సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి తిలక్ నగర్ సర్పంచ్ పదవి ఆశించడంతో దానికి విముఖత వ్యక్తం చేసిన కాం గ్రెస్ ను కాదని బి ఆర్ ఎస్ ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టిఆర్‌ఎస్ తిలక్ నగర్ సర్పంచ్ అభ్యర్థిగా సుర్ణపాక సత్యనారాయణ బరిలో ఉండనున్నారు.

ఇక రొంపే డు పంచాయతీలో మాజీ సర్పంచ్ అజ్మీర శంకర్ మరో 30 మంది ఎంఎల్ పార్టీ వీడి బి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎ మ్మెల్యే బి ఆర్ ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి హరిప్రియ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఏది ఏమైనా శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రి య పూర్తయ్యే వరకు మండలంలో రాజకీయాలు రసవత్తరంగా మారటంతో పాటు ఎవరూ ఊహించని సమీకరణాలు నెలకొననున్నాయి.