calender_icon.png 13 August, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17న దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులు, కాళ్లు పంపిణీ

13-08-2025 01:24:15 AM

నారాయణ్ సేవా సంస్థాన్ పిఆర్ భగవాన్ ప్రసాద్ గౌర్

ఖైరతాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత నారాయణ్ లింజ్, కాలిపర్స్ ఫిట్ మెంట్ శిబిరాన్ని ఈ నెల 17న నిర్వహించనున్నట్లు నారాయణ్ సేవా సంస్థాన్ మీడియా, పిఆర్ భగవాన్ ప్రసాద్ గౌర్ తెలిపారు.

హైదరాబాద్ చంపాపేట్‌లోని మినర్వాగార్డెన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ శిబిరంలో ఎంపికైన 780 మంది వికలాంగులకు కృత్రిమ అవయాలను అమర్చి, వారికి కొత్తజీవితాన్ని అందించడం జరుగు తుందన్నారు.

ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన  సమావేశంలో సంస్థాన్స్ స్థానిక ప్యాట్రన్ అల్కాచౌదరి, ప్రముఖ సామాజిక కార్యకర్త జస్మత్ బాయ్ పటేల్ రిదేశ్ జాగీర్దార్, ఆశ్రమఇన్ మహేంద్ర సింగ్ రావత్తోతో కలిసి  శిబిరం పోస్టర్ ను విడుదల చేశారు.

అనంతరం ప్రసాద్ గౌర్ మీడియాతో మాట్లాడుతూ.. వికలాంగులకు వైద్య, విద్య, నైపణ్యలు భివృద్ధి, ఆర్ధికంగా, క్రీడా అకాడమీల ద్వారా శారీరకంగా, మానసికంగా బలోపేతానికి సంస్సాన్ అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ కృషిచేస్తున్నారని తెలిపారు. సంస్సాన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 40వేల మందికి కృత్రిమ అవయాలను అమర్చారని వివరించారు.