calender_icon.png 7 May, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణికి ఉచిత ఆటో సర్వీస్

07-05-2025 12:56:02 AM

వైరా, మే 6 (విజయక్రాంతి)సంపాదనే ధ్యేయంగా కొనసాగుతున్న సమాజంలో, సంపాదన కన్నా సమాజసేవే గొప్పదని ఆచరణలో చేసి చూపుతున్న ఆటో డ్రైవర్ అన్న. వివరాల్లోకి వెళితే వైరా మండలం కేజీ సిరిపురం గ్రామానికి చెందినలతేఫ్ గత కొన్నేళ్లుగా గర్భిణీ స్త్రీలకు ఉచిత సేవలు అందిస్తున్నారు.

అదే క్రమంలో సోమవారం తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఖాదర్ బాబా చిన్న కూతురు షేక్ సాదిక ను వైద్య పరీక్షల నిమిత్తం రెడ్డిగూడెం నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఉచితంగా తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఇంటికి తీసుకువచ్చి దించాడు. గత కొన్నేళ్లుగా  గర్భిణీ స్త్రీలకు ఉచిత సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న  లతీప్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.