calender_icon.png 7 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీయూలో రెగ్యులర్ అధ్యాపకుల నూతన కార్యవర్గం ఏర్పాటు

07-05-2025 12:57:08 AM

మహబూబ్ నగర్, మే 06 ( విజయక్రాంతి): పాలమూరు పాలమూరు యూని వర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులు పాలమూరు యూనివర్సిటీ టీచర్స్ అసోసియేష న్   నూతన సంఘాన్ని మంగళవారం ఏర్పా టు చేస్తూ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అసోసియేషన్ అధ్యక్షులుగా ప్రొఫెసర్ ఎం జైపా ల్ రెడ్డి,  జనరల్ సెక్రెటరీగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ కిషోర్, ముఖ్య సలహాదారుగా ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్ , ఉపాధ్యక్షులుగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి ,డాక్టర్ నూర్జహాన్ ,డాక్టర్ చంద్ర కిరణ్, కో శాధికారీగా డా అనురాధ రెడ్డి , జాయింట్ సెక్రెటరీస్ డాక్టర్ రాజకుమార్,  డాక్టర్ శాం తి ప్రియ  డాక్టర్ మార్క్ పోలోనియస్ ,కల్చరల్ సెక్రటరీ డాక్టర్ కే ప్రవీణ  పాలకమం డలి సభ్యులుగా  డాక్టర్ కుమారస్వామి ,డా క్టర్ కృష్ణయ్య,  డాక్టర్ అంకం భాస్కర్ ,డా క్టర్ విజయలక్ష్మి , డాక్టర్ ఎన్ సంధ్యారాణి , డాక్టర్ మాలవి , డాక్టర్ సిహెచ్ వెంకట్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

ఈ మేర కు కార్యవర్గంతో కూడిన పత్రాన్ని  రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు గారికి అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ  యూ నివర్సిటీ ప్రయోజనాల కోసం,అధ్యాపకుల సమస్యలపై, అధ్యాపకులకు దక్కాల్సిన ప్ర యోజనాలపై పనిచేస్తుందని అన్నారు.