04-09-2025 12:17:19 AM
ప్రతి గురువారం ఆర్థోపెడిక్, ప్రతి శుక్రవారం కార్డియాలజీ కన్సల్టేషన్లు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ముందస్తు రోగ నిర్ధారణ, ఆరోగ్య సమస్యల నివారణ, అందరికీ చేరువైన వైద్య సేవల కోసం కేర్ హాస్పిటల్స్ మలక్‌పేట కొత్త అడుగు వేసింది. ప్రతి గురువారం ఉచిత ఆర్థోపెడిక్ నిపుణుల కన్సల్టేష న్లు, అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వర కు ఉచిత కార్డియాలజీ కన్సల్టేషన్లు అందుబాటులో ఉంచినట్టు ఆసుపత్రి ప్రకటించిం ది.
గుండె, ఎముకల సమస్యలతో బాధపడుతున్న రోగులకు ముందస్తు వైద్య సలహాలు, నివారణ చికిత్స, రెండవ అభిప్రాయం వం టి సేవలు అందించడానికి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ ఎడ్లా మాట్లాడుతూ.. “కేర్ హాస్పిటల్స్‌లో మా ప్రాధాన్యత ఎప్పటికీ రోగి -కేంద్రీకృత సేవలే. ఈ కొత్త కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు గుండె, ఎముకల ఆరోగ్యం పై ప్రత్యేక వైద్యం అందించాలన్నదే మా ఉద్దే శం’ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రు ల వైద్యులు ప్రతి సంవత్సరం ఒక నెలపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలని పిలుపునిచ్చారు. ఈ ఆలోచనకు అనుగుణంగా, మల క్‌పేట కేర్ హాస్పిటల్స్ ఉచిత కన్సల్టేషన్లు ప్రారంభించింది. మరింత సమాచారం, రిజిస్ట్రేషన్ మరియు అపాయింట్‌మెంట్ కోసం 040-6165 6565 నంబర్‌కు సంప్రదించవచ్చు.