31-12-2025 12:00:00 AM
జనంపల్లి అనిరుధ్‌రెడ్డి జన్మదినo సందర్భంగా 200 మంది విద్యార్థులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు
జడ్చర్ల, డిసెంబర్ 30: ప్రయాణంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని సంతోషకరమైన జీవితాలు గడపాలని సంకల్పంతో ఉచితంగా లైసెన్సులు అందించేందుకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ చైర్ పర్సన్ పుష్పలత నర్సింలు అన్నారు. నియోజకవర్గంలోని డిగ్రీ కాలేజ్ విద్యార్ధి విద్యార్థులకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని పేద విద్యార్థులకు రూ 5 లక్షలతో తన సొంత నిధులతో డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తూ సురక్షితంగా ఉండాలని అని సూచించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ సుకన్య,మార్కెట్ చైర్మన్ జ్యోతి ఆల్వాల్ రెడ్డి కౌన్సిలర్ లు రాజు, చైతన్య చౌహన్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బుర్ల వెంకటయ్య,
టౌన్ ప్రెసిడెంట్ మీనాజోద్దీన్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ చాగంటి రఘు భాస్కర్ రెడ్డి గంట వంశీ, తుంగ రఘు, దాల్ ఖాజా, రమేష్ , సన్నీ ఎత్తం, ఎన్ ఎస్ యుఐ నాయకులు అనుప శేఖర్, పహాద్, దినేష్ సాయి, తేజా బొక్క రఘు, కింగ్ ఖాజా, మొహ్మద్, మల్లికార్జున్, రవీందర్ వెంకటేష్, మరియు ఎన్‌ఎస్ యుఐ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని కాలేజీ విద్యార్థిని, విద్యార్థులకు లైసెన్స్లు పంపిణీ చేశారు.