calender_icon.png 31 December, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వైకుంఠ ఏకాదశి

31-12-2025 12:00:00 AM

  1. పోటెత్తిన భక్తజనం తెరుచుకున్న వైకుంఠ ఉత్తర ద్వారం 
  2. కోదండరామస్వామి ఆలయంలో కిటకిట
  3. కాషాయపు కండువాలు కప్పిన సర్పంచ్ 
  4. ఆలయంలో అయ్యప్పల కోలాహోలం

గోపాలపేట డిసెంబర్ 30 : ముక్కోటి వైకుంఠ ఏకాదశి శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా జరిగింది. భక్తజనంతో ఆలయం కిటకిటలాడింది. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ కోదండరామ స్వామి ఆలయం లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే భక్తజనం శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి తండోపతండాలుగా తరలి వెళ్లారు. మూడేళ్లకోసారి వచ్చే ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి శ్రీ రాములవారిని దర్శించుకుంటే నిత్యం ఎంతో సంతోషంగా ఉంటారని భక్తజనం వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు అంతకుముందు.

సీతారామ స్వామిని పల్లకిలో ఉత్తరం ద్వారా వెళ్లి ఆలయం చుట్టూ ప్రదర్శించారు. ప్రజలంతా స్వామివారి పల్లవి తీసే వాళ్ళు పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి ఉత్తర ద్వారం నుండి వెళ్లేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలించారు. అనంతరం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చిన అయ్యప్ప స్వాములు వందల సంఖ్యలో వచ్చి స్వామి వారి కీర్తనలు ఆలపించారు వారందరికీ కూడా గ్రామ సర్పంచ్ స్వప్న భాస్కర్లు కాషాయపు కండువాలు కప్పి సన్మానించారు. గ్రామ సర్పంచ్ స్వప్న భాస్కర్ శ్రీ సీతారామస్వామి ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.

ఉత్తర ద్వార దర్శనం.. సర్వపాపహరణం

చిన్న చింతకుంట, డిసెంబర్ 30: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడి ప్రతిరూపంగా కొరవబడుతూ, పల్లె ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు శ్రీకురుమూర్తి రాయుడుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పుష్య మాసం శుక్లపక్షంలో వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది. దీన్నే సర్వే ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. సోమవారం మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతల తో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారని పురాణాలు చెబుతున్నాయి.

ఉత్తర ద్వార దర్శనం తో శ్రీవారిని దర్శించుకుంటే కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తుల విశ్వాసం. శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో స్వామివారి ప్రధాన ఆలయంలో అందమైన పూలతో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తరద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు.  వైకుంఠ ఏకాదశి సందర్భంగా మండలంలోని స్థానిక ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.