calender_icon.png 4 November, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

04-11-2025 12:43:12 AM

జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్

మంచిర్యాల, నవంబర్ 3 ( విజయక్రాంతి) : జిల్లాలోని లక్షెట్టిపేట మండలం గుల్లకోటలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ నెల 4వ తేదీన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ తెలిపారు. 2025 - 26 సంవత్సరానికి గాను జిల్లాలో 223.93 లక్షల చేప పిల్లలు పెంచేందుకు ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగి ందని తెలిపారు.

జిల్లాలోని 380 చెరువులు, రిజర్వాయర్లు ఉన్నాయని, వీటిలో 369 సీజనల్ చెరువులలో 115.65 లక్షల 35- 40 మిల్లీమీటర్ల చేప పిల్లలు, 5 పేరినియల్, 6 రిజర్వాయర్లలో 108.28 లక్షల 80- 100 మిల్లీమీటర్ల చేప పిల్లలను వదలడం కొరకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో 51.58 లక్షల ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.