04-11-2025 12:41:22 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
భైంసా, నవంబర్ ౩ (విజయక్రాంతి): రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సూచించారు. సోమవారం బైంసా వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా క్వింటాలుకు రూ.8,110 కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు తెలిపారు.
జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. రైతులు ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా స్లాట్ బుకింగ్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పంటను బాగా ఆరబెట్టుకొని తెస్తే ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. జిల్లాలో 17 జిన్నింగ్ మిల్స్, 17 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు.
అనంతరం ముధోల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షాల కారణంగా పత్తిలో తేమశాతం పెరిగిందని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. అనంతరం మార్కెట్ యార్డులో కలెక్టర్, శాసనసభ్యులు సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలిం చారు. ప్రతి గింజ సోయా పంటను ప్రభు త్వం దశలవారీగా టోకెన్లు జారీ చేసి పంటలన్నింటినీ కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్, ఏడి మార్కెటింగ్ గజానన్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ సిద్ధిఖీ, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీవో నీరజ్ కుమార్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.