calender_icon.png 17 November, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామునూరులో ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన

17-11-2025 12:52:52 AM

ఎర్రుపాలెం నవంబర్ 16 ( విజయ క్రాంతి): ఎర్రుపాలెం మండలం లోని మా మునూరు గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. స్ధానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో అమరజీవి వి.ఎల్ నరసింహారావు గారి కుమారుడు య పాచేదు మధు,మామునూరు శ్రీనివాసరా వు, వరికుటి ఆధాo ఆర్థిక సహాయంతో సీపీ ఎం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

వైద్య శిబిరం ప్రారంభ సభ కు   సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి  కన్నెబోయిన శ్రీనివాసరావు  అధ్యక్షత జరిగింది.ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  డివిజన్ కార్యదర్శి మాడిపల్లి గోపాలరావు మా ట్లాడుతూ సిపిఎం పార్టీలో పనిచేసి అమరులైన వారి జ్ఞాపకంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్మిక కర్షక పేదల సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని వారి జీవితం మనకు ఆదర్శమన్నారు.

ప్రస్తుతం పేదలకు వైద్యం అందని ద్రాక్ష లాగా మారిందన్నారు. ప్రముఖ వైద్యులు చీకటి భారవి, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు గార్లు మాట్లాడుతూ గ్రామీణ పరిసర ప్రాంతాలలో చాలామంది పేదల నివసిస్తున్నారని ఈ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయం ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.

ఇలాంటి మరిన్ని వైద్య శిబిరాలు జరగాలని గ్రామీణ వైద్యం మెరుగుపడాలని మా వంతు సహకారం అందించుటకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీపీఎం పార్టీ జిల్లా కమిటి సభ్యులు శీలం నరసింహారావు, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు మధిర పట్టణ కార్యదర్శి పడకంటి మురళి, యుటిఎఫ్ జిల్లా నాయకులు అనుమొలు కోటేశ్వరరావు,

సీపీఎం సీనియర్ నాయకులు తెలప్రోలు రాధాకృష్ణ, గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు నల్లమోతు హనుమంతరావు షేక్ లలా షేక్ కరీం, బెతు శీను వేల్పుల స్వామి కృష్ణ మారబత్తుల సుందరరావు,రాణి తదితరులు పాల్గొన్నారు.