06-01-2026 08:16:06 PM
సిద్దిపేట రూరల్: నారాయణరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం పీపుల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సిద్ధిపేట ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు.
ఈ వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందారు. శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన నూతన పాలకవర్గానికి, గ్రామ ప్రజలకు పీపుల్స్ హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.