calender_icon.png 8 January, 2026 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలకు ఉపాధ్యాయుడి చేయూత

06-01-2026 08:20:55 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): తాను పనిచేసే పాఠశాలకు చేయూతనందించేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని మండల విద్యాధికారి చత్రునాయక్ అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బోళ్ల గోవిందరెడ్డి అనే ఉపాధ్యాయుడు రూ.5 వేల ఆర్థిక సహాయంతో ఐదు చెత్త బుట్టలు, మూడు డ్రమ్ములు మంగళవారం పాఠశాలకు అందించారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి పాల్గొని మాట్లాడుతూ... పాఠశాలకు అవసరమైన చిన్నచిన్న పనులకు ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థిక సహాయాన్ని అందించి ఇతరులకు ఆదర్శంగా నిలవడం హర్ష నియమన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయుడు బోళ్ల గోవిందరెడ్డిని ఆయన అభినందించారు.