06-01-2026 08:13:06 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని మోర్సుగూడెం గ్రామనికి చెందిన బోడిగే చంద్రయ్య మృతి చెందగా సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ మంగళవారం నివాళులర్పించారు. చంద్రయ్య మరణ వార్త తెలిసిన వెంటనే సర్పంచ్ వారి నివాసానికి చేరుకుని, భౌతికకాయంపై పూలమాల వేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు,వార్డు మెంబర్ వలిగొండ కవిత సత్యనారాయణ, గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.