25-07-2025 12:00:00 AM
ప్రధాన నిందితులు రిమాండ్
తూప్రాన్, జూలై 24 :గుర్తు తెలియని వ్యక్తి హత్య ఉదంతాన్ని తూప్రాన్ పోలీసులు చేధించారు. డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత నాలుగు రోజుల క్రితం శివంపేట్ మండల పరిధి మాగ్దూంపూర్ లో జరిగిన హత్య కేసులో సబిల్ (22) అనే వ్యక్తి చనిపోయిన కేసులో ప్రధాన నిందితులను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.
ఈ కేసులో ముఖ్యంగా సబిల్ అనే యువకుడు మైనర్ అమ్మాయిని ప్రేమించడం జరిగిందని, ఇది తెలుసుకున్న అమ్మాయి సమీప బందువులు అతన్ని మందలించినా వినకపోవడంతో పాటు పెళ్ళి చేయాలని లేనిపక్షంలో అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపారు.
దీంతో తప్పని పరిస్థితుల్లో సమీప బంధువైన అప్సర్, అతని స్నేహితుడు సంతోష్ అనే వ్యక్తి కలసి సబిల్ను హత్య చేయడానికి పథకం రూపొందించినట్ల తెలిపారు. ఈ మేరకు అతనితో చర్చలు జరపడానికి రమ్మని చెప్పి హత్య చేసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన తూప్రాన్ సిఐ రంగ కృష్ణ, శివంపేట్ ఎస్‌ఐ కరుణాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందిస్తూ త్వరలో రివార్డ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.