02-11-2025 04:44:01 PM
హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి..
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రతి వ్యక్తి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని వీరన్నపేటలో గల హెచ్‌ఎన్ ఫంక్షన్ హాల్‌లో మోషన్ ఈ అజార్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచితంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యసేవలను అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, గతంలో కంటే కూడా మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపైన దృష్టి పెట్టాలని సూచించారు. ఏదైనా ఆపత్కాలంలో ఉపయోగపడేలా తప్పకుండా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ప్రతి కుటుంబం కర్తవ్యమన్నారు. మెడికల్ క్యాంపులో సేవలు అందించిన వైద్యులకు ఎమ్మెల్యే ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మోసిన్, హాజి, చిన్న వీరభద్రయ్య, అంజయ్య వివిధ ఆసుపత్రుల వైద్యులు, వాలంటీర్లు ఉన్నారు.