calender_icon.png 2 July, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదం అంచున ప్రయాణం

02-07-2025 12:29:47 AM

బోయినపల్లి: జూలై 1 (విజయక్రాంతి) బోయినపల్లి మండలం దేశాయిపల్లి వద్ద వరదాకాల్వ వంతెన అత్యంత ప్రమాదకరంగా మారింది. మానువాడ శ్రీ రాజరాజేశ్వర జ లాశయం ఉమ్మడి జిల్లాలో రైతులకు అత్యం త ముఖ్యమైనది.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి జలాశయం పొడవు నా వరదవెళ్లి వర కు నిర్మాణం చేసిన వరద కాలువకు రెండువైపులా రక్షణగా గ్రామాల్లో వంతెన నిర్మాణం చేసి రైతులకు ప్రయాణీకులకు ఎటువంటి ప్రమా దం జరగకుండా వంతెన నిర్మాణం చేశారు.

దేశాయిపల్లి వద్ద కొదురుపాకకు వెళ్తున్న వైపు లో వంతెన వాల్‌ను రాత్రి సమయం లో గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొనగా వాల్ కూలిపోయింది దీంతో బోయినపల్లి కొదురుపాక వైపు వెళ్లే ద్విచక్ర వాహనాలు ఆటోలు ఇతర వాహ నాలు ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదమరసి ప్రయాణం చేస్తే వరద కాలువలో పడి ప్రమాదాల బారిన పడడమే కాకుండా ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది.

అధికారులు నిత్యం ఈరహదారిపై నుంచి వెళుతుంటారు కానీ ఎవరు కూడా కూలిపోయిన వాల్ ను నిర్మాణం చేసేందుకు చర్యలు గాని ఆవైపుగా ఆలోచన కూడా చేయడం లేదు. ఈ రెండు గ్రా మాల రైతులు తాత్కాలికంగా వారు ప్రమాదం బారిన పడకుండా కూలిపోయిన మధ్యలో కట్టె లు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు.

ప్రమాదం జరిగాక అధికారులు స్పందించడం కంటే ముందుగా మరమ్మత్తు చేసి ప్రమాదాలను నివారించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని మండల ప్రజలుకోరుతున్నారు.