15-08-2025 12:00:00 AM
ఐ.ప్రసాద్ రావు :
అభివృద్ధి అంటే కేవలం కొందరిది మాత్రమే కాదని గ్రహించాలి. కేవలం నాలుగు రహదారులు, ఆరు పోర్టులు, పది విమానాశ్రయాలు, అద్దాల మేడల నిర్మాణాలే వాస్తవ అభివృద్ధి అని భావించొద్దు. ఇదే అభివృద్ధి అయితే ప్రతీ సంవత్సరం 2 లక్షల మంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుని ఇతర దేశా లకు వెళ్లి స్థిరపడుతున్నారనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరముంది.
యావత్ భారతావనీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఇప్పటికీ మనం సాధించిన విజయాలకన్నా.. పరిష్కారం కావాల్సిన సమస్యలే ఎక్కువగా వెంటాడుతున్నాయి. ముఖ్యం గా అంతర్జాతీయ స్థాయిలో వివిధ అంశా ల్లో, రంగాల్లో మన భారత పరిస్థితిని విశ్లేషణ చేసుకోవడం సముచితం.
అంతర్జాతీయ సంతోష సూచీలో 118వ, అవినీతిలో 96వ, ఆకలి సూచిలో 111వ, నిరుద్యోగంలో 76వ, మానవాభివృద్ధి సూచికలో 130వ, లింగ అసమానతలో 131వ స్థానం లో కొనసాగుతుంది. 2019--21 సంవత్సరాల మధ్య గృహహింస కేసులు 31.2% శాతం నమోదయ్యాయి. అందరికీ విద్య, వైద్యం అనేవి ఇప్పటికీ అందని ద్రాక్షలాగే ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న యువత కోట్ల సంఖ్యలో ఉందంటే అతిశయోక్తి కాదు.
నేటికీ అనేక గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక వైద్యశాలలు సంగతి దేవు డెరుగు. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరిం త దారుణంగా ఉంది.‘డోలీలే’ నేటికీ గత్యంతరం అవుతున్న పరిస్థితి ఏర్పడింది. రహ దారులు లేని గిరిజన గ్రామాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. ఇవన్నీ మరచిన మన పాలకులు ఎంతో సాధించామని జబ్బలు చరుచుకుంటున్నారు. ఎందుకు పనికిరాని ఈ విజయాలను పక్కనబెట్టి ఇకనైనా సమస్యలపై దృష్టి సారించాలన్న విషయం గుర్తిస్తే మంచిది.
సంక్షేమ పథకాలపైనే ఆధారం..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తునా దాదాపు సగం మంది దేశ జనా భా ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఇవే కాలక్రమేణా ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారుతు న్న పరిస్థితి. అంతేకాని అందరికీ విద్య ఉపా ధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయడం లేదు. ముఖ్యంగా వ్యవసా య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి అడుగులు పడడం లేదు.
నేటికీ అనేక గ్రామాల్లో పరిశుభ్రమైన మంచినీరు సరఫరా, విద్యుత్ సదుపాయాలు లేవు. ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పాలకులు ఇకనైనా గ్రహించాలి. కేవలం దేశ జీడీపీతోపాటు దేశంలో ఉన్న బిలియనీర్ల సం పద పెరిగినంత మాత్రాన దేశం అభివృద్ధి చెందిందని భావించడం సరికాదు.
దేశ సంపదలో 60 శాతం వారి వద్దే
ప్రపంచంలో అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న భారత్ అతి త్వర లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని సంబురం పడటం సరికాదు. వాస్త వంగా మన దేశంలో ఉన్న అత్యధిక పేద, మధ్యతరగతి ప్రజల వాస్తవ జీనవ ప్రమాణాలు ఎలా ఉన్నాయో గుర్తించాలి. దేశ సం పదలో 60 శాతం కేవలం ఒక శాతం ఉన్న బిలియనీర్ల వద్దే కేంద్రీకృతమయిందని గ్రహించాలి.
ఆర్థిక, సామాజిక అంతరాలు రోజు రోజుకు దేశంలో ఎక్కువవుతున్నాయి. దేశ సంప ద, ప్రకృతి, ఆర్థిక వనరుల దోపిడీ జరుగుతుంది. ప్రస్తుత పాలకులు.. బడా పారిశ్రామిక సంస్థలకు, వ్యక్తులకు అభివృద్ధి పేరు తో రాయితీలు, ప్రోత్సాహకాల అందిస్తున్నారు. అడవుల్లోని అనేక విలువైన వన రులు కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా దారాదత్తం చేస్తున్నారు.
అభివృద్ధి అంటే కేవలం కొందరిది మాత్రమే కాదని గ్రహించాలి. కేవలం నాలుగు రహదారులు, ఆరు పోర్టులు, పది విమానాశ్రయాలు, అద్దాల మేడల నిర్మాణాలే వాస్తవ అభివృద్ధి అని భావించొద్దు. ఇదే అభివృద్ధి అయితే ప్రతీ సంవత్సరం 2 లక్షల మంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుని ఇతర దేశా లకు వెళ్లి స్థిరపడుతున్నారనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరముంది.
పెరిగిపోతున్న నిరుద్యోగం..
దేశంలో నానాటికీ నిరుద్యోగం పెరిగిపోతుంది. దీనితో పాటు అధిక ధరలు, ప్రైవేటీకరణ, రాజకీయ ఆర్థిక సామాజిక అంతరాలు ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. రాజకీయ అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుంది. సాక్షాత్తూ ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువ మందిపై అనేక కేసు లు నమోదయ్యాయి. బెయిల్‌పై మనుగడ సాగిస్తున్న పరిస్థితి చూస్తుంటే ఇదేనా మన స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన స్వాతంత్య్ర భారతదేశమేనా అని ఆలోచించాల్సి వస్తుంది.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వా లు.. నిరంకుశ విధానాలు అమలు చేస్తూ ప్రశ్నించే గొంతులకు తాళం వేస్తున్నారు. చట్టసభలు తరచూ వాయిదాప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి. చట్టసభ ల్లో అనేక బిల్లులు అర్థవంతమైన చర్చలు లేకుండానే మూజువాణి ఓటుతో ఆమో దం పొందడం జరుగుతుంది.
అన్నింటా నకిలీ తాండవం..
దేశ వ్యాప్తంగా అన్ని విషయాల్లో ‘నకిలీ’ తాండవిస్తుంది. భారతదేశం అంటేనే ‘భిన్నత్వంలో ఏకత్వానికి‘ చిరునామా. అయితే నేడు అంతా ఒకే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అలీన విధానాన్ని పక్కన పెట్టి, కేవలం ఒకటి రెండు దేశాల పక్కన చేరడంతో ఇటీవల అనేక సమస్యలు మన దేశం ఎదుర్కొన్న పరిస్థితి.
మన విదేశాంగ దౌత్య విధానం మరింత మెరుగు పరుచుకోవాల్సిన అవసరముంది. స్వదేశంలో మరిన్ని పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలి. ‘స్కిల్ డెవలప్‌మెంట్’కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. శాస్త్ర సాంకేతిక రంగా లు, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు అత్యం త ప్రాధాన్యత ఇవ్వాలి.
మన తర్వాత స్వాతంత్య్రం సాధించిన అనేక దేశాలు మన కంటే అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. కనీసం 2047 స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికైనా దేశంలో ఉన్న ప్రజలం దరికీ కనీస సౌకర్యాలు లభ్యమయ్యే దిశగా అడుగులు వేయాలి. జీఎస్టీ ద్వారా ప్రతీ నెలా వచ్చే లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని, జనాభా ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలకు సముచితంగా అందించాలి.
ఫెడరలిజం, సెక్యులరిజం, సామ్యవాదం ప్రజాస్వామ్య వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని పరిపాలన అందించాలి. విద్వేషం, అణచివేత చర్యలకు స్వస్తి పలకడంతోనే దేశంలో అశాంతి కనుమరుగవుతుంది. సమస్త సమస్యలకు పరిష్కారం సుగమం అవుతుందనేది వాస్తవం. ఇక స్వచ్ఛమైన రాజకీయాల ఆధారంగానే ‘వికసిత్ భారత్ 2047’ సాధ్యమవుతుందని గ్రహించాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 6305682733