03-08-2025 12:00:00 AM
నేడు స్నేహితుల దినోత్సవం :
స్నేహితులందరికీ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మా విజయక్రాంతి దినపత్రిక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాల్యంలో ప్రారంభమైన స్నేహం.. పెరిగే పెద్దయినా గుండె లోతుల్లో ఏదో మూల చిన్ననాటి జ్ఞాపకాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. స్నేహితులు వుంటే జీవితాంతం ప్రతి వ్యక్తి కాలం నీ నేస్తం అంటూ గడిపేయవచ్చు.
బంధాలను, అనుబంధాలను కలగొలుపుకొని మనిషి మనుగడ సాగించేందుకు బాటలు వేసేది స్నేహం. రక్తసంబంధికుల కంటే గొప్పగా వర్ణించదగినది స్నేహం. స్నేహితులలో ఆనందాన్ని సంతోషాన్ని జీవితాన్ని పంచేది మధురమైన స్నేహం. దాపరికాలు లేని బాహటం స్నేహం. సృష్టిలో మధురమైనదిగా స్నేహాన్ని వర్ణించవచ్చు. అటువంటి స్నేహాలకు ఒక ప్రత్యేకమైన రోజు అంటూ ఉంది. అదే ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితులు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
స్నేహం దేవుడిచ్చిన వరం. అద్భుత సృష్టిలో అన్నిటికన్నా మిన్న స్నేహం మాత్రమే. స్నేహానికి హద్దులు లేవని, స్నేహంతో దేనినైనా సాధించొచ్చు అంటూ స్నేహితులు సంతోషంగా స్నేహాన్ని, వారి భావాలను ఒకరు ఒకరు అర్థం చేసుకుంటూ సరదాగా గడిపే రోజు స్నేహితుల రోజు. కుల మతాల పట్టింపు లేదు, భాష భేదం లేదు అంటూ ప్రపంచాన్ని చుట్టూ వచ్చేది స్నేహం. స్నేహానికి హద్దులు లేవు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ నిత్యం ప్రతి చోట స్నేహితులు సందడి చేస్తూనే ఉంటారు.
ఈ సృష్టి లో స్నేహం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. వందమంది బంధువులు ఉన్నా కానీ ఒక స్నేహితుడు వెంట ఉంటే ప్రపంచంలో దేనినైనా సాధించగలం అని ధైర్యం ఉంటుంది.
చిన్ననాటి నుంచి స్నేహానికి అర్థం చెబుతూ స్నేహంలో గొప్పతనాన్ని చాటి చెబుతూ ఎంత వయసు వచ్చినప్పటికీ స్నేహానికి మంచి బానిస కాక తప్పదు. జీవితంలో బెస్ట్ యూత్ ఫ్రెండ్స్‌గా ఉండి వయసు మళ్లిన స్నేహాలు కూడా ఇప్పటికీ జ్ఞాపకాల దొంతరలో చెరగని ముద్రలు వేస్తూనే ఉంటాయి.
ఏరా.. మామ, బావ, తమ్మి, అన్న బాబాయ్ అంటూ ఏవో వరుసలతో పిలుచుకుంటున్నప్పటికీ అన్ని వరుసలు అన్ని బంధాలు ఒక స్నేహితుడిలోనే ఉన్నాయి. స్నేహంలో హితులుగా, సన్నిహితులుగా జీవితాంతం కష్టసుఖాల లో పాలుపంచుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బాధ్యతాయుతమైన సమాజంలో జీవనం సాగిస్తే అటువంటి స్నేహాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. సృష్టిలో స్నేహితులు సెమీగాడ్స్ గా విరాజిల్లుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.
గొర్రెల లక్ష్మణ్‌కుమార్