calender_icon.png 2 October, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగం అడిగే స్థాయి నుంచి.. ఉద్యోగాలిచ్చే స్థాయికి

02-10-2025 01:40:15 AM

  1. కేటీఆర్ స్ఫూర్తితో  ‘డాక్టర్ గార్డ్’ కంపెనీ ఏర్పాటు 
  2. బోరబండ యువకుల కంపెనీ కార్యాలయాన్ని సందర్శించిన కేటీఆర్ 
  3. తెలంగాణ భవన్‌కు వాటర్ ప్రూఫింగ్ పనుల అప్పగింత

హైదరాబాద్, అక్టోబర్ 01 (విజయక్రాంతి) :  ‘ఉద్యోగాలు అడిగే వారుగా కా దు, ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఉండా లి’ అని కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన బోరబండకు చెంది న తొమ్మిది మంది యువకులు కలిసి ‘డాక్టర్ గార్డ్’ పేరుతో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్ కంపెనీని ప్రా రంభించారు. యువ మిత్రులు ప్రారంభిం చిన కంపెనీ ప్రాంగణాన్ని వారి కోరిక మేరకు కేటీఆర్ బుధవారం సందర్శించారు.

ఉద్యోగాలు అడగడం కాకుండా, పది మందికి ఉపాధి కల్పించామన్న గొప్ప లక్ష్యంతో వీరు ఈ కంపెనీని ప్రారంభించడం అభినందనీయమన్నా రు. జేఎన్‌టీయూ ప్రసంగంలో కేటీఆర్ చెప్పిన మాటల స్ఫూర్తితోనే కంపెనీని ఏర్పాటు చేసినట్టు ‘డాక్టర్ గార్డ్’ బృందం తెలిపింది. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అయినప్పటికీ, తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో కంపెనీని స్థాపించినట్టు యువకులు తెలిపారు.

ప్రస్తుతం తమ కంపెనీలో 30 మం దికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, రానున్న ఒక సంవత్సరంలోనే ఈ సంఖ్యను వెయ్యికి పైగా తీసుకుపోయే లక్ష్యంతో పనిచేస్తున్నామని వారు కేటీఆర్‌కు వివరించారు. తమ వాటర్ ప్రూఫ్ సొ ల్యూషన్స్‌లో ప్రస్తుతం ఉన్న పద్ధతులను మరింత ఆధునికతను, టెక్నాలజీని జోడిం చి ముందుకు తీసుకువచ్చినట్టు యువకులు కేటీఆర్‌కు తెలిపారు. 

కంపెనీకి మొదటి కస్టమర్‌గా కేటీఆర్

కంపెనీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ బృందంలోని సోదరుడు ఇమ్రో జ్ సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పంపి, కేటీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే తాము కంపెనీని ప్రారంభించామని, తాము సా ధించిన చిన్నపాటి కార్యకలాపాలను సందర్శించి తమకు మరింత స్ఫూర్తిని ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. తమ కంపెనీకి మొదటి కస్టమర్‌గా తానే ఉంటానని సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌కు సంబంధించిన వాటర్ ప్రూఫ్ పనులను వారికి అప్పగించారు.  

చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం విజయవంతం 

ఆర్థిక పెట్టుబడి, కుటుంబ నేపథ్యం లేకు న్నా మిత్ర బృందంతో కలిసి ఏషియన్ పె యింట్స్ పెట్టి విజయం సాధించిన స్ఫూర్తి ని తాము తీసుకున్నామని యువకులు చెప్పడం అభినందనీయమన్నారు. చిత్తశుద్ధితో ఏది ప్రారంభించినా అద్భుతమైన విజయం సాధిస్తుందని, సమాజంలోని అందరి అండ, ఆశీర్వాదం లభిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ తెలిపారు. ‘డాక్టర్ గార్డ్’ భవిష్యత్‌లో అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.