15-05-2025 10:27:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని బాసరలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అన్ని విధాల సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) వెల్లడించారు. గురువారం సాయంత్రం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ సభ్యులతో మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు జిల్లా కలెక్టర్ తో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాసర మండలంలో కేంద్రీయ విద్యాలయ స్థాపనకు అవసరమైన స్థలాలను బృందం పరిశీలించిన విషయాన్ని కలెక్టర్‌కు వివరించారు. వసతి, మౌలిక సదుపాయాలపై చర్చించారు. కేంద్ర విద్యాలయ నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు భౌగోళిక పరిస్థితులు, కమ్యూనికేషన్ సదుపాయాలు, భవిష్యత్ అవసరాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.