calender_icon.png 26 November, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు

26-11-2025 12:00:00 AM

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి పత్రాలను అందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బజార్హత్నూర్, నేరడిగొండ, నవంబర్ 25 (విజయక్రాంతి) : గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని నేరేడుగొండ, బజార్ హత్నూర్ మండలలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. ముం దుగా మారుమూల గ్రామమైన దాబాడీ గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.

గ్రామంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో నెలకొన్న ఇండ్ల సమస్య, డ్రైనేజి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా నేరడీగొండ మండ లం రాజురాలో 54 ఇందిరమ్మ ఇళ్ల మం జూరు పత్రాలను, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఇందిరమ్మ చీరలను సైతం మహిళ లకు పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామానికి అతిపెద్ద సమస్య రోడ్డు అని తనను సంప్రదించినప్పుడు గ్రామానికి తాత్కాలిక రోడ్డు కొరకు రూ. 10 లక్షలు మంజూరు చేసి రోడ్డు పనులు పూర్తి చేయించడం జరిగిందన్నారు. గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్ల 50 లక్షలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్యాం సుందర్, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.