calender_icon.png 26 November, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు

26-11-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

లక్షెట్టిపేట టౌన్, నవంబర్ 25 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని, వారి ఆర్థికాభివృద్ది కోసమే మహిళలకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందజేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ పథకంలో భాగంగా మంగళ వారం లక్షెట్టిపేటలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, మండలాల తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తుందని, ఇందులో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథ కంలో భాగంగా కోళ్ళ పెంపకం, డైరీ ఫార్మ్, క్యాంటీన్ ఇతర వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని, మందమర్రి మండలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో పాటు మిగతా ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు. దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, మహి ళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు.

అనంతరం మంచిర్యాల నియోజకవర్గంలోని 1,618 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 43 లక్షల 61 వేల రూపాయల వడ్డీలేని రుణాల పంపిణీ చెక్కును అందజేశారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు రూ. 6 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని, ఇందులో దండేపల్లి మండలంలోని 703 గ్రూపులకు రూ. 62,34,770, హాజీపూర్ మండలంలోని 469 గ్రూపులకు రూ. 45,68,470, లక్షెట్టిపేట మండలంలోని 446 గ్రూపులకు రూ. 35,57,903, ఇలా 1.43 కోట్ల స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కుల ను అందించామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిళి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఆరీప్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు నలిమెల రాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పూర్ణ చందర్, దండేపల్లి మాజీ జెడ్పీటీసీ గడ్డం త్రిమ్తూర్తి, మం చిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ముని, జిల్లా సమైక్య అధ్యక్షురాలు అనిత, హాజిపూర్, లక్షేటిపేట, దండేపల్లి మండలాల ఐకెపి ఏపీవో లు తహసీల్దార్, ఎంపీడీవోలు, సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.