calender_icon.png 26 November, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

26-11-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, నవంబర్ 25 : రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైతు వేదికలో ఇందిరా మహి ళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. 2671మహిళా స్వశక్తి సంఘాలకు మంజూ రు చేసిన రూ. 2,31,120 కోట్ల చెక్కును అందజేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో మూడు మండలాలకు ఆర్టీసీ బస్సు కొనుగోలు కోసం రూ. 90 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

మహిళ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ఆర్థికంగా ఎదగా లని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్, డిఆర్డిఏ డిపిఐఎంబి స్వర్ణలత, ఏపిఎం ఎస్‌ఎస్ రాజకుమార్, సీసీఐడి ప్రకాష్, ఏపీఎంలు విజయలక్ష్మి, శ్యామల, ప్రమోద్ కుమార్, బ్రహ్మయ్య, తిరుపతి, త్రయంబక్, మాజీ జెడ్పిటిసి కారుకూరి రామ్ చందర్, నాయకులు నాతరి స్వామి, బత్తుల రవి తదితరులు పాల్గొన్నారు.