calender_icon.png 11 September, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి

08-09-2025 12:42:53 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ

ఆదిలాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాం తి): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ కలిసారు. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలు వాతో సన్మానించారు. ఆదిలాబాద్ పార్లమెం ట్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం సమర్పిం చారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ. 73 కోట్ల నిధులను అభివృద్ధి కొరకు కేటాయించడం సంతోషంగా ఉందని, ఆదిలాబా ద్ ప్రజలు ఏనాడూ కాంగ్రెస్ పార్టీ ని, సీఎం రేవంత్ రెడ్డిని మరువలేరని సుగుణ తెలిపా రు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్‌తో పాటు మంత్రులందరికీ  ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.