06-05-2025 12:15:34 AM
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు కార్పొరేటర్ అరుణా సురేందర్ యాదవ్ వినతి పత్రం అందజేత
ఎల్బీనగర్, మే 5 : నాగోల్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ కోరారు. సోమవారం ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నాగోల్ డివిజన్ లోని రాక్ టౌన్ కాలనీలోని సర్వే నంబర్ - 58 , బాలాజీనగర్ కాలనీ, చాణక్యపురి కాలనీ, అప్కో కాలనీల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలన్నారు.
ఆయా కాలనీల్లో అసంపూర్తిగా మిగిలిన భవన నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను కోరారు. నాగోల్ డివిజన్ లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ ను కోరారు. నాగోల్ శ్మశాన వాటిక, మన్సూరాబాద్ శ్మశాన వాటిక లో మౌలిక వసతులు కల్పించడానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ ను కోరారు. కార్యక్రమంలో నాగోల్ డివిజన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.