calender_icon.png 6 May, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే అధికారులపై వేటు తప్పదు.!

06-05-2025 12:15:04 AM

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి: 

 జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్‌కర్నూల్ మే 5 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన నేపథ్యంలో రాజకీయ వక్తిళ్ల కారణంగా అనర్హులకు మంజూరు చేస్తే సంబంధిత శాఖ అధికారిపై శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ అధికారులను హెచ్చరించారు.

సోమవారం నాగర్ కర్నూల్ ఆర్డీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గవద్దని సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి  తెచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన  కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి మండలం, మహేశ్వరం గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి వచ్చిన భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి రసీదును అందించారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అంతకుముందు ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత శాఖ జిల్లా అధికారులకు  దరఖాస్తులను బదిలీ చేశారు.