07-11-2025 12:09:42 AM
‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించారు దర్శకుడు కేవీ అనుదీప్. మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యం తో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారాయన. కథానాయకుడు విశ్వక్‌సేన్, దర్శకుడు కేవీ అనుదీప్ కలయికలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఫంకీ’. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‌సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తుండగా, కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 2026, ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; కూర్పు: నవీన్ నూలి; ఛాయాగ్రహణం: సురేశ్ సారంగం; నిర్మాతలు: నాగవంశీ, సాయిసౌజన్య; రచన, దర్శకత్వం: అనుదీప్ కేవీ.