07-11-2025 12:10:44 AM
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘కాంత’. దర్శకు డు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. బలమైన భావోద్వేగాలతో నిండిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది.
ఇందు లో గుర్తింపు కోసం ఆత్రుతగా ఉన్న కొత్త నటుడి నుంచి, స్టార్‌డమ్‌కు చేరిన తర్వాత ఈగోని ప్రదర్శించే స్టార్‌గా దుల్కర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అదిరిపోయింది. ముఖ్యంగా ‘ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని..’ అంటూ దుల్క ర్ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. సముద్రఖని సహజ నటనతో గురువు పాత్రలో ఆకట్టుకున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథకు ప్రాణం పోసే పాత్రలో కనిపించారు. రానా దగ్గుబాటి పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇవ్వడం కథలో కొత్త టెన్షన్, బలా న్ని తెచ్చింది. నవంబర్ 14న విడుదల కానున్న ఈ చిత్రానికి జాను చాంతర్ సంగీతం సమకూర్చుతుండగా, డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామలింగం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.