23-08-2025 12:09:58 AM
ఎల్లారెడ్డి, ఆగస్టు 22 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి లక్ష్యం అని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటి ప్రజా సంక్షేమం ధ్యేయంగా వనమోత్సవం కార్యక్రమంలో పాల్గొని పర్యావరణం పెంపొందించాలని ఐదవ వార్డు ప్రత్యేక అధికారి జ్యోతి అన్నారు.
శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలోని ఆరవ వార్డు లో ఆమె ఇంటింటికి ఆరు మొక్కలను నేరుగా మున్సిపల్ సిబ్బందితో పంపిణీ చేశారు. 250 మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పెరట్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలను తప్పకుండా నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.