calender_icon.png 29 December, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో మెకానికల్ ఇంజనీరిoగ్ లో "ఫ్యూజన్ ఫార్జ్” వర్క్‌షాప్

29-12-2025 06:45:54 PM

ఘట్‌కేసర్,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని వెంకటాపూర్ అనురాగ్ విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డైమాక్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఫ్యూజన్ ఫార్జ్-డిజైన్ అండ్ మోడలింగ్ వర్క్‌షాప్ ను నిర్వహించారు. ఈవర్క్‌షాప్‌ కి దుష్యంత్ సాయి ప్రొఫెషనల్ ట్రైనర్ పాల్గొని 100 మంది మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులకి ఆటొడేస్క్ ఫ్యూజన్ సాఫ్ట్‌వేర్ ద్వారా త్రీడీ డిజైన్ మరియు మోడలింగ్‌ లో ప్రత్యక్ష అనుభవం కల్పించారు. అదనంగా డిజిటల్‌ మ్యానుఫాక్చరింగ్‌ విధానాలపై అవగాహన పెంపొందించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో రూపకల్పన మరియు ఉత్పత్తి అభివృద్ధి నైపుణ్యాలను పెంపొందించేలా దోహదపడింది.  

ఈ సందర్భంగా డైమాక్ టీం, విశ్వవిద్యాలయ సీఈఓ నీలిమకి, ఇంజనీరింగ్‌ కళాశాల డీన్‌ డాక్టర్ వి.విజయకుమార్ కి నిరంతర ప్రోత్సాహం సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే మెకానికల్ విభాగాధిపతి అసోసియేట్ డీన్‌ డాక్టర్ కె. శ్రీనివాస చలపతి సరైన మార్గదర్శకత్వం, పర్యవేక్షణ అందించారు. అదేవిధంగా డాక్టర్ ఎన్. మదన్ మోహన్ రెడ్డి  అసోసియేట్ డైరెక్టర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు వర్క్‌షాప్ సమన్వయం, వనరుల సమీకరణ, విద్యార్థుల మార్గదర్శకతలో అందించిన సహకారం ప్రశంసనీయమని తెలిపారు.