calender_icon.png 12 December, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తు భరోసా.. విజన్

07-12-2025 12:00:00 AM

డాక్టర్ తిరునహరి శేషు :

ఆరు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్టం దేశంలోనే ఒక అత్యున్నత రాష్ర్టం గా ఎదుగుతుందని తెలంగాణ ప్రజలు ఆశించారు. కానీ ఈ దశాబ్దపు తన ప్రస్థానం లో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం నాటి ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలకు దూరంగానే ప్రయాణిస్తున్నట్లుగా కనపడుతుంది. తొలి పాలకుల బంగారు తెలంగాణ నుంచి నేటి పాలకుల తెలంగాణ రైజింగ్ వరకు ప్రభుత్వాల నిర్దేశిత లక్ష్యాలు గొప్పగానే కనపడు తున్నాయి కానీ ఆ లక్ష్యాలను సాధించే క్రియా శూన్యత వల్ల తెలంగాణ ఉద్యమ ఆ కాంక్షలు నెరవేరడం లేదనే అసంతృప్తి ప్ర జల్లో గూడు కట్టుకొని ఉన్నది.

ఐఎస్‌బి సహకారంతో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్- 2047పైన డి సెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా రాష్ర్ట ప్రభు త్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో విజన్ డాక్యుమెంట్ ప్రజల కోస మా? పెట్టుబడిదారుల కోసమా? ఎవరికో సం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్--2047 గురించి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 1999లో నాటి సమై క్య ఆంధ్ర పాలకులు కల్పించిన విజన్--2020 డాక్యుమెంట్ భ్రమలు తెలంగాణ ప్రజలకు మరొకసారి గుర్తుకొస్తున్నాయి.

ఏమిటీ విజన్ డాక్యుమెంట్-47? 

దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ లాంటి దేశాలు తక్కువ సమయంలో సా ధించిన ప్రగతి లాగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక రోరింగ్ లయన్‌గా ఎదిగే సామర్థ్యం ఉన్నది. రాష్ర్టం ఏర్పాటైన  ఈ పుష్కరకాలంలో ప్రజల కోసం కాకుండా పాలకుల ఆలోచనలకు అనుగుణంగానే వి ధానాలు రూపొందించబడ్డాయి, అమలు చేయబడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాలు.. సమగ్రాభివృద్ధి కోసం.. ఆంధ్ర ప్రదేశ్ స్వ ర్ణాంధ్ర విజన్--47 ని, తెలంగాణ రాష్ర్టం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్--47ని రూపొందించాయి.

పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పన, రైతుల ఆదాయాల పెంపు, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా ఎదగటానికి అవకాశాలు కల్పించే లక్ష్యంగా విద్య, ఆరో గ్యం, ఉపాధి, పరిశ్రమలు, క్రీడలు, మహి ళా సాధికారత, రైతు సంక్షేమం, సాంకేతికత లాంటి ఎనిమిది రంగాలపై (అష్టపది) దృష్టి పెడుతూ రాష్ర్ట ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది.

2034 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రూపొందించడానికి రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో మూడు రీజియన్లుగా విభజిస్తూ రాబోయే 22 సంవత్సరాల్లో రాష్ర్టం సాధించే ప్రగతి కోసం ఈ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్--2047ను రూపొందించామని రా ష్ర్ట ప్రభుత్వం చెబుతోంది. మొదటి రీజియన్‌లో హైదరాబాద్ కోర్ నగరాన్ని, రెండవ రీజియన్‌లో జిల్లా కేంద్రాలను, మూ డవ రీజియన్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్‌లో ప్రణాళిక లు రూపొందించారు.

ఏఐ, ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పేస్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాంటం టెక్నాలజీ, స్టార్ట్ అప్ లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా లాంటి కీలకమైన పరిశ్రమలలో పెట్టుబడులను ఆక ర్షించడం లాంటివి ఉన్నాయి. ఉద్యానవనాల సాగు పెంపు, సాగులో సాంకేతికత ద్వారా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల వైపుకి రైతులను మళ్ళించడం ద్వా రా రైతుల ఆదాయాలను పెంచడం, ఇంది రా మహిళా శక్తి పథకాల ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చే యాలని విజన్ డాక్యుమెంట్ లో ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఫోర్త్ సిటీ నిర్మా ణం, ఏఐ యూనివర్సిటీ, స్కిల్, స్పోర్ట్స్ వి శ్వవిద్యాలయాల ఏర్పాటు, రీజనల్ రింగ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, హై స్పీడ్ మొబిలిటీ కారిడార్లు, కొత్త విమానాశ్రయాలు, పర్యాటకం లాంటి కీలకమైన అంశాలను విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరుస్తూ పారదర్శక పాలన సులభతర అనుమతులతో 2047 నాటికి నిర్దే శిత లక్ష్యాలను చేరుకోవాలనేది ప్రభుత్వ విధానంగా కనిపిస్తుంది.

రైజింగ్‌లో పేదలకు చోటేదీ? 

రైతులు, మహిళలు, యువత, పేదలే మా ప్రధాన అజెండా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌లో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూ, యువత, మహిళలు, రై తులే మా ప్రాధాన్యతా అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ నాటి విజన్- 2020 హైటెక్ సిటీ నుంచి నేటి తెలంగాణ రైజింగ్ భారత్ ఫ్యూచర్ సి టీ వరకు పెట్టుబడిదారులకు దక్కిన ప్రా ధాన్యత పేదల ప్రయోజనాలకు, వారి సంక్షేమానికి విజన్ డాక్యుమెంట్‌లో చో టు దక్కుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌లో కూడా పరిశ్రమలు పెట్టుబడుల ఆకర్షణకు దక్కిన ప్రాధాన్యత చూ స్తేనే అర్థమవుతుంది. విజన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడి సంస్థలతో దరిదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు చేసుకోబోతుంది. నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ పొందించిన ఐటీ విధానం, టీఎస్ ఐపాస్ లాంటి పారిశ్రామిక విధానాలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ కాస్త భిన్నంగా కనపడుతుంది.

కానీ పెద్దగా ని ర్మాణాత్మకమైన తేడా ఏమీ కనపడటం లేదు. తెలంగాణ లాంటి ఉద్యమ నేపథ్యంతో ఏర్పాటైన రాష్ట్రానికి కావలసింది తెలంగాణ రైజింగ్ లాంటి నమూనానా లేక కేరళ ఇటీవల అత్యంత పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన నమూనానా పాలకులు ఆలోచించుకోవాలి. పక్కా ఇల్లు, భూ పంపిణీ, రేషన్ కార్డులు, పెన్షన్లు, ప్రజారోగ్య కేంద్రాలు, ఉచిత వైద్యం, శుద్ధమైన త్రాగునీరు లాంటి సౌకర్యాల కల్పన ద్వా రా కేరళ రాష్ర్టం అత్యంత పేదరికాన్ని కేవ లం మూడు సంవత్సరాల్లో అధిగమించగలిగితే మరి 84 శాతం అట్టడుగు సామా జిక వర్గాల ప్రజలు ఉన్న తెలంగాణ రా ష్ర్టం ఎందుకు అలాంటి విజయాల వైపు అడుగులు వేయలేకపోతుందో పాలకులు ఆలోచించాలి.

లక్ష్యాలు సాధించేనా! 

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టిన ఈ రెండు సంవత్సరాల కాలం లో ఒక్క పెట్టుబడుల ఆకర్షణలో తప్ప.. పభుత్వం ప్రతిష్టాత్మకంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కానీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కానీ, ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణంలో కానీ ప్రభుత్వ వైఫల్యాలు స్ప ష్టంగా కనిపిస్తున్నాయి. మా పోటీ కర్ణాటక, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలతో కాదు చైనా, జపాన్, సింగపూర్, దక్షిణ కొ రియా లాంటి దేశాలతో పోటీ పడతామని సీఎం చెపుతున్నారు.

కానీ పెట్టుబడుల ఆకర్షణలో, జీఎస్‌డీపీలో మహారాష్ర్టతో, సం క్షేమ పథకాల అమలులో తమిళనాడుతో, పేదరిక నిర్మూలనలో, మానవాభి వృద్ధి లో, అక్షరాస్యతలో కేరళతో తెలంగా ణ రాష్ర్టం పోటీపడాలి. తెలంగాణ రాష్ర్టం సంపన్న రాష్ర్టంగానే కాదు సంక్షేమ రా ష్ర్టంగా ఎదిగినప్పుడే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి. 8 నిమిషాల కార్యక్రమాని కి 80 లక్షల ప్రజాధనాన్ని పాలకులు వృ ధా చేస్తే 2028 నాటికి తెలంగాణ రాష్ర్టం అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలకు పెరిగి ఒక రుణగ్రస్థ రాష్ర్టంగా మారుతుం ది.

విజన్ డాక్యుమెంట్ లో నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రభుత్వ సంకల్పంతో పాటు అధికారుల క్షేత్రస్థాయి పనితీరు కూడా నిర్ణయాత్మకంగా ఉంటుంది. పెట్టుబడిదారులకువనరులు దోచిపెట్టే విజన్ డాక్యు మెంట్లు కాకుండా కేరళ మోడల్ లాగా ప్రజల కేంద్రంగా విజన్ డాక్యుమెంట్లు ఉంటే భవిష్యత్తులో తెలంగాణ దేశంలోనే అత్యున్నత రాష్ర్టంగా ఎదుగుతుంద నడంలో సందేహం అక్కర్లేదు. 

 వ్యాసకర్త సెల్:  9885465877