07-12-2025 12:00:00 AM
దుప్పటి మొగిలి :
* పభుత్వం ప్రజారోగ్యం పట్ల నిబద్ధతతో ఉంటే, ఈ ద్వంద్వ వైఖరిని వీడి నికోటిన్, ఆల్కహాల్‌పై కఠిన నియంత్రణకై చర్యలు తీసుకోవాలి. పర్యావరణ హిత పరిశ్రమలకు మద్దతు కల్పిం చాలి. పొగాకు, గుట్కా వంటి ఉత్పత్తులను దశలవారీగా పూర్తిగా నిషేధించాలి.
దేశవ్యాప్తంగా ప్రజారోగ్యంపై ప్ర భుత్వాలు భారీ ప్రకటనలు చేస్తున్నాయి. టీవీ, రేడియో ఆన్ చేసినా.. సినిమా థియేటర్లలో కూర్చున్నా ఒక సం దేశం మాత్రం కచ్చితంగా వినిపిస్తుంది. ప్లాస్టిక్ వాడొద్దు, సిగరెట్ తాగొద్దు, మ ద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు, గుట్కా లు తినొద్దు. ఇవి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు పదేపదే చేసే ప్రకట నలు. ఈ సందేశాలను ప్రజల్లోకి చేర్చడానికి పాలకులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రచారాల కోసం కొత్త బడ్జెట్లు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
ప్రజల సురక్షిత జీవనంకై నియంత్రణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేక శా ఖలను ఏర్పాటు చేసి, చట్టాలను కఠినతరం చేయడం అభినందనీయమే. అయి నా ఇక్కడే ఒక చిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. ఈ హానికర పదార్థాలు ప్రజలకు చేరేలా ఎవరు అనుమతులు ఇస్తున్నారు? వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలకు ఇదే ప్రభుత్వాలు నిస్సంకోచంగా లైసెన్సులు ఇవ్వ డం పాలకుల ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుంది.
ఒక వైపు ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ మరో వైపు ఈ హానికర ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు లైసె న్సులను అందించడంతో పాటు భారీ ప్రోత్సాహకాలు, రాయితీలు కూడా కల్పిస్తున్నాయి. ప్లాస్టిక్ పరిశ్రమలకు పన్నుల రాయితీలు, ఎగుమతి సదుపాయాలు ఇ స్తుండడం ఆలోచించాల్సిన అంశం.
ఆర్థిక ప్రయోజనం!
ఈ ద్వంద్వ వైఖరికి ప్రధాన కారణం ఆ ర్థిక ప్రయోజనమే. పొగాకు, మద్యం వంటి ఉత్పత్తులపై ప్రభుత్వం భారీగా ఎక్సుజ్, కస్టమ్స్, జీఎస్టీ పన్నులు విధిస్తుంది. ఈ పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఏటా వేల కోట్ల ఆదాయం సమకూరుతుం ది. ప్రభుత్వానికి ఇవి పెద్ద స్ధిర ఆదాయవనరులు. అందుకే హానికరమని తెలిసినా నిలిపివేయలేని పరిస్థితి. ఈ ఆదాయం ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కీలకంగా ఉంటుంది.
ఒకవైపు తాగితే ఆరో గ్యం పాడవుతుందని ప్రకటిస్తూనే.. మరోవైపు తాగితే వచ్చే పన్నులతో అభివృద్ధి చేస్తాం అనే విధానాన్ని పాలకులు అనుసరించడం ఆర్థిక అవసరాన్ని తెలియజే స్తుంది. నిషేధాలు, నియంత్రణలు అన్నీ మాటల్లోనే ఉంటాయి. కానీ కంపెనీల లా బీయింగ్‌తో పాటు ప్రభుత్వ ఆదాయ ప్ర యోజనాల ముందు ఈ ప్రయత్నాలు ఫ లించడం లేదు. ప్రకటనలలో ఆరోగ్యంపై ప్రేమ, అనుమతుల్లో లాభాలపై ఎప్పటికీ ఆశ చావదు.
ప్రజలను చెడు అలవాట్లు విడిచేయమంటారు గాని తయారీదారులను మాత్రం కట్టడి చేయరు. అమతులు ఇవ్వడం, వాడకం, పెంచడం.. ఆపై వాడొద్దని ప్రకటనలు ఇస్తుంటారు. అయితే ఇది ప్రకటన యుద్ధమా? ప్రభుత్వ స్థాయి మోసమా? ఈ విధానం ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కాదా అనేది గ్రహించాల్సిన అవసరముంది.
నిషేధంపై వెనుకడుగు..
ఒక వస్తువు ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమని తెలిసినప్పటికీ దాని ని యంత్రించడానికి బదులు కేవలం వినియోగించవద్దు అని చెప్పడమే విడ్డురంగా అనిపిస్తుంది. అసలు వాటి తయారీనే నిలిపివేస్తే, వినియోగించే సమస్యే ఉత్పన్నం కాదు. వీటి తయారీని పూర్తిగా నిషేధించే బదులు, నియంత్రణపై దృష్టి పెట్టడం వల్ల అక్రమ రవాణా , నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయానికి కూడా ఆస్కారం ఉంటుంది.
ప్రకటనలకు కోట్ల రూపాయలు ఖర్చు పె ట్టే బదులు, ఆ నిధులను ఆరోగ్య సదుపాయాల మెరుగుదల, వ్యసన విముక్తి కేం ద్రాల ఏర్పాటుకు కేటాయించడం సమంజసం.పెద్ద కంపెనీల వారు ఆర్థిక శక్తితో ప్రభుత్వాలపై పెంచే ఒత్తిడి, రాజకీయ ప్ర యోజనాలు ఫండింగ్‌లు, ప్రకటనల ని యంత్రణ ఇవన్నీ పాలసీలను ప్రభావితం చేస్తాయి. తాజాగా గురువారం కేంద్రం పొగాకుపై అధిక సెంట్రల్ ఎక్సైజ్ సుం కాన్ని విధించేందుకు అవకాశం కల్పిస్తే రూపొందించిన బిల్లును గురువారం పార్లమెంటు ఆమోదించింది.
ప్రస్తుతం పొగాకుపై విధించిన జీఎస్టీ పరిహార సెస్సు వ సూళ్లను నిలిపివేసిన అనంతరం ఎక్సైజ్ సుంకం అమల్లోకి రానుంది. సిగరెట్లు, సి గార్లు, హుక్కా, జర్దా, సెంటెండ్ టుబాకో వంటి ఉత్పత్తులకు ఇది వర్తిస్తోందని వివరించారు. సెస్ వసూలును నిలిపివేసిన తరువాత ముడి పొగాకుపై 60--70 ఎక్సయిజ్ డ్యూటీ వసూలు చేసే అవకాశం ఉంది. అయితే ప్రాణాలు కబళిస్తున్న పొ గాకు విషయంలో చూసుకుంటే.. ప్రజా ప్రయోజనం కంటే కంపెనీ ప్రయోజనమే ముఖ్యం కాబోలు.. కేంద్ర ప్రభుత్వాలు ని షేధాలపై వెనుకాడుతున్నాయి.
ఆరోగ్య విధానాలు..
ఈ వైఖరితో ప్రజలు గుట్కా,మద్యం బారిన పడుతున్నారు. యువత వ్యసనాలకు బలవుతూ రోగాలతో ఆరోగ్యవ్య యాలు పెరిగి కుటుంబాలు కూలిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం కలుషితమవుతుంది. ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల నిబద్ధతతో ఉంటే, ఈ ద్వంద్వ వైఖరిని వీడి నికోటిన్, ఆల్కహాల్‌పై కఠిన నియంత్రణకై చర్యలు తీసుకోవాలి. పర్యావరణ హిత పరిశ్రమలకు మద్దతు కల్పిం చాలి. పొగాకు, గుట్కా వంటి ఉత్పత్తులను దశలవారీగా పూర్తిగా నిషేధించాలి.
నిషే ధం సాధ్యం కాని మద్యం విషయంలో ఉత్పత్తి, అమ్మకాలపై అత్యంత కఠినమైన లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేయాలి. ప్లాస్టిక్ తయారీ కంపెనీలకు ప్రత్యామ్నా య, పర్యావరణహిత ఉత్పత్తుల తయారీకి మారేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి.విద్యార్థుల పాఠ్యాంశాలలో ఆరోగ్యకరమైన జీవన విధానం, వ్యసనాల దుష్పరిణామాలు, పర్యావరణ పరిరక్షణ తప్పనిసరిగా చేర్చాలి.
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా తయారీదారులపై చ ర్యలతో అది నిరూపించాలి. ప్రకటనలు ఒక మంచి అడుగే కానీ ఆ ప్రచారాల ఫలి తం ప్రజల ఆరోగ్యంలో కనిపించాలంటే అనుమతులు, లైసెన్సులు, పరిశ్రమ ని యంత్రణలే మారాలి. కానీ మారాల్సింది పాలనా విధానం, పాలకుల ద్వంద్వ వైఖరి, దేశం ఆరోగ్యవంతం కావాలంటే ప్రజలు మాత్రమే మారితే సరిపోదు. ప్రభుత్వాల నిజాయితీ కూడా మారాల్సిన అవసర ముంది. దేశ భవిష్యత్తు కోసమైన పటిష్టమైన, నిబద్ధతతో కూడిన ఆరోగ్య విధా నాన్ని అమలు చేయాలి.
వ్యాసకర్త సెల్: 8466827118