calender_icon.png 5 November, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పాఠశాలను సందర్శించిన జి.యం. ఎడ్యుకేషన్

05-11-2025 01:47:56 AM

ఇల్లెందు, నవంబర్ 4,(విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియా లోని సింగరేణి స్కూల్ ని జి.యం ఎడ్యుకేషన్ శ్రీ వెంకటాచారి మంగళవారం సందర్శించారు. ఆయన మొదట జి.యం కార్యాల యం ఇల్లందు ఏరియా జి.యం వి.కృష్ణ య్య, ఇతర ఉన్నత అధికారులు వెంకటాచారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సింగరేణి పాఠశాలను సందర్శించి ఉపాద్యాయులతో మాట్లాడి పిల్లల చదువు గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా జి.యం ఎడ్యుకేషన్ వెంకటాచారి మాట్లాడుతూ.. ఈ 2025 -26 విద్యా సంవత్సరంలో పాఠశాల మొదటి రోజు నుండే పిల్లవానికి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు.ఈ విద్యా సంవత్సరంలో ఒలింపియాడ్, గేమ్స్, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్, కల్చరల్ వంటి అన్నిటిలో పిల్లలకు హోలిస్టిక్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.

గత సంవత్సరం గమనించినట్లయితే ఎస్‌ఎస్సి రిజలట్స్ లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మా విద్యార్థులు మంచి మార్కులు సాధించారు అని మీరు కూడా మంచిగా చదివి స్కూల్ కి మా సింగరేణికి మంచి పేరు తెలవని అన్నారు. ఈ కార్యక్రమం లో యస్వోటు జియం రామస్వామి, ఏజీఎం (ఐఈడీ) గిరిధర్ రావు, ప్రభాకర్ డిజిఎం (పర్సనల్) అజ్మీర తుకారాం, డీజియం (ఫైనాన్సు) మధుబాబు పర్చర్సే అధికారి దిలీప్ కుమార్, ఎన్విరాల్ మెంట్ అధికారి యాన్.సతీష్ మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.