19-07-2025 02:15:28 AM
సీఎస్‌కు ఉద్యోగ సంఘాల వినతి
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): గచ్చిబౌలి భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యుచువల్ ఎయిడెడ్ కో-ఆప రేటివ్ హౌసింగ్ సోసైటికి కేటాయించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు తమదంటూ స్థలం కబ్జాకు యత్నిస్తున్నారని టీఎన్జీవో నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఉత్తర్వుల మే రకు బీటీఎన్‌జీవోఎస్ సొసైటీకి ఆ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ శుక్రవారం ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రిలను కలిసి వినతిపత్రం సమమర్పించారు.
దీనిపై వారు స్పందిస్తూ తప్పకుండా విచారణ జరి పి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో రా ష్ర్ట అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కా ర్యదర్శి ఎస్.ఏం. హుస్సేని ముజీబ్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సొసై టీ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.