calender_icon.png 19 July, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్‌ఈలో 97.11 శాతం సీట్లు భర్తీ

19-07-2025 02:13:27 AM

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ఎప్‌సెట్ తొలివిడత సీట్లను కేటాయించారు. రాష్ట్రంలోని 172 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 83,054 సీట్లకు గానూ 77,561 (93.3 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,083 సీట్లను కేటా యించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆ యా కాలేజీల్లో ఈనెల 22 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 5, 493 సీట్లు మాత్రం మిగిలాయి.

ఆరు యూ నివర్సిటీలు, 76 ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం వందశాతం సీట్లు నిండాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ అనుబంధ కోర్సు ల్లో 58,742 సీట్లకు గానూ 57,042 (97.11 శాతం) సీట్లు నిండాయి. సీఎస్‌ఈకు డిమాం డ్ ఎక్కువగా ఉండటంతో ఎప్పటిలాగే ఈ సారి కూడా ఈ బ్రాంచ్‌లోనే సీట్లు అత్యధికంగా నిండుతున్నాయి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో 16,112 సీట్లలో 14,0 54 (87.23 శాతం) సీట్లు భర్తీకాగా, సివిల్ మెకానికల్ విభాగంలో 7,100 సీట్లకుగానూ 5,632 (79.32 శాతం) సీట్లు, కెమికల్, జియో ఇన్‌ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, డైరీయింగ్ తదితర కోర్సుల్లో 1,100 సీట్లలో 833 (75.73 శాతం) సీట్లు నిండాయి.

సివిల్, మెకానికల్‌లోని ఏడు కోర్సుల్లో వంద శాతం సీట్లు నిండాయి. మొత్తంగా  జెండర్‌వారీగా చూసుకుంటే పురుషులు 41,924 (54.1 శాతం) సీట్లు, మహిళలు 35,637 (45.9శాతం) సీట్లు పొందారు. క్యాటగిరీ వారీగా బీసీ బీలో అత్యధికంగా ౧౫,౮౯౭ మంది సీట్లు పొందగా, ఓసీ అభ్యర్థులు ౧౫,౪౭౦ మంది విద్యార్థులు సీట్లు పొందారు.