20-05-2025 12:34:02 AM
విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజాచిత్రం ‘ఏస్’. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ సినిమాను 7సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కించారు. రుక్మిణి వసంత్ కథానాయకిగా నటించిన ఈ చిత్రం మే 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
‘నా పేరు బోల్ట్ కాశీ’ అంటూ హీరో తనను పరిచయం చేసుకోవడంతో ట్రైలర్ ఆరంభమైంది. మలేసియాలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. ‘జూదం అనేది ఉప్పెనలాంటిది.. క్లుమైక్స్ గుర్తుంది కదా’ అంటూ యోగిబాబు చెప్పే కామెడీ డైలాగ్ బాగుంది. హీరో దేనికోసం పోరాటం చేస్తున్నాడు? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు.