20-05-2025 12:33:07 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా మే 30న విడుదల కానుంది. తొమ్మిదేళ్ల తర్వాత మంచు మనోజ్ ఈ సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మే 20న మనోజ్ బర్త్‌డే కూడా కలిసివచ్చింది. ఈ సందర్భంగా మనోజ్ విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
-తొమ్మిదేళ్లయింది సినిమాలకు దూరమై. కొన్ని కారణాల వల్ల బ్రేక్ తీసుకున్నా. ‘-అహం బ్రహ్మాస్మి’ సోలోగా వద్దామని చేసుకున్న కథ. అయితే అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే ‘భైరవం’, ‘మిరాయ్’ దేవుడు ప్లాన్ చేసిన సినిమాలే అనుకుంటున్నా. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నందున ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యా. ఈ చిత్రం నా కెరియర్‌లో చాలా ప్రత్యేకం.
-ఈ పుట్టినరోజు నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది. నా బర్త్‌డే వస్తున్న తరుణంలోనే నేను కోల్పోయిన వేదికను దేవుడు మళ్లీ ఇచ్చాడు. ఇక నుంచి వీలైనంత ఎక్కువ సమయం సినిమాలకే కేటాయించాలని భావిస్తున్నా.
-‘భైరవం’ మంచి యాక్షన్ డ్రామా. నా పాత్ర పేరు గజపతివర్మ. నేను ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. చాలా ఇంటెన్స్, ఫెరోషియస్ క్యారెక్టర్. ప్రతి పాత్రకూ ప్రాధాన్యం దక్కింది. పాత్రలన్నీ చాలా బలంగా ఉంటాయి.
-సాయి నాకు తమ్ముడులాంటివాడు. రో హిత్ మంచి ఫ్రెండ్. ఈ సినిమా కోసం ముగ్గురం ఎక్కువ సమయం ప్రయాణించాం. కాబట్టి మా బంధం ఇంకా బ లపడింది. ఓ పాట చిత్రీకరణ సమయం లో రోహిత్ కుటుంబంలో విషాదం చో టుచేసుకుంది. ఆ బాధలో ఉన్నప్పటికీ ఎవరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక రో హిత్ షూటింగ్‌లో పాల్గొన్నారు. నా వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్య లు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ధైర్యం కోల్పోకుండా రోహిత్‌ను స్ఫూర్తిగా తీసుకొని జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేసుకుంటూ వెళ్లాం.
-నాన్న కష్టపడి పైకొచ్చారు. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. -నమ్మినోళ్లను బాగా చూసుకోవడం, పది మందికి సహాయంచేయడం, నిజాయితీగా ఉండడం ఆ యన దగ్గరే నేర్చుకున్నా. మా నాన్నే నాకు హీరో.
-నేను మొదట్నుంచీ ప్రయోగాత్మక పాత్రలే చేశాను. ప్రతి సినిమా గత చిత్రానికి పూర్తి భిన్నంగా ఉండాలనుకుంటాను. భవిష్యత్తులో కొత్త రకం సినిమాలే చేస్తా. ఎప్పుడైనా అవకాశం వస్తే పిల్లల కోసం ఒక సినిమా చేయాలనుంది.