calender_icon.png 24 November, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృషి హోం అనాథాశ్రమంలో ఆటల పోటీలు

24-11-2025 12:00:00 AM

మేడ్చల్ అర్బన్ నవంబర్ 23 (విజయక్రాంతి):గుండ్లపోచంపల్లి మున్సిపల్  పరిధిలోని గౌడవెల్లి సమీపంలో గల కృషి హోం అనాధ ఆశ్రమంలో  ఆటల పోటీలు నిర్వహించారు.  గిర్మాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఖో ఖో,వాలీబాల్ పోటీలలో మొదటి బహుమతి గెలుపొందారని మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు కొండం ఆంజనేయులు ముదిరాజ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చదువులతో పాటు క్రీడా రంగాలలో కీలకపాత్రలు పోషించి అభివృద్ధి చెందాలని ఆయన విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాగం అర్జున్, వంగేటి హనుమంత రెడ్డి, బండి సత్యం గౌడ్, కొండల్ రెడ్డి పాఠశాల కోచ్ మునీర్, ప్రణీత్ కో కోచ్ లు మనోజ్, సంపత్, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.