24-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకర్ పల్లి,నవంబర్ 23: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని, ప్రతి ఒక్కరూ భక్తి భావాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కాల యాదయ్య పిలుపునిచ్చారు. ఆదివారం శంకర్ పల్లి మండలం మహాలింగాపురం (ధోబిపేట్) గ్రామ సమీపంలోని మల్లన్న ఆలయ ఆవరణలో నిర్వహించిన ‘శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ‘ మహోత్సవంలో ఎమ్మెల్యే ‘కాలే యాదయ్య పాల్గొని పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, పి ఏ సి ఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, పడాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.