calender_icon.png 24 October, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవిష్ణు సరసన

24-10-2025 12:33:34 AM

యువ కథానాయకి నయన్ సారిక వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. ఇంతకుముందు ఈ అమ్మడు ‘ఆయ్’ సినిమాలో నార్నే నితిన్‌తో జత కట్టింది. ‘క’ చిత్రంలో కిరణ్ అబ్బవరంతో కలిసి అలరించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. మానసశర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంగీత్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ యంగ్ బ్యూటీ మరో సినిమాలోనూ భాగమైంది. శ్రీవిష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించనుంది.

శ్రీవిష్ణు ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జీ నిర్మిస్తున్న ఈ సినిమాలోనే నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడి యోను రివిల్ చేశారు. ఈ చిత్రం ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగనున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో శ్రీవిష్ణు హిలేరియస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఇంకా ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయిశ్రీరామ్ డీవోపీ కాగా, రధన్ సంగీతం సమకూరుస్తారు. ఏ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.