calender_icon.png 24 October, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టసభలలో 50% రిజర్వేషన్లు కల్పించాలి

24-10-2025 12:34:26 AM

  1. బీసీ బిల్లుకై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
  2. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి
  3. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
  4. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశా రు. పార్లమెంట్ లో బీసీ బిల్లుకై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెం చాలని, ఇందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు గురు వారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, ఇన్చార్జి నూకాలమ్మ  అధ్యక్షతన జరిగిన మీడియా సమా వేశంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల డిమాండ్ల సాధనకై ప్రధానమంత్రి మోడీ ని కలిసి చర్చలు జరపాలన్నారు. అఖిలపక్షాన్ని బీసీ నాయకులను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరా రు.

చంద్రబాబు నాయుడు బీసీల పక్షాన నిలబడి బీసీ బిల్లు పెట్టిస్తే చరిత్రలో నిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెం ట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ప్రధాని మోడీ వల్లే సాధ్యమవుతుందన్నారు. బీసీల డిమాండ్లు, అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి విద్యాభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలన్నారు.

ప్రత్యేకంగా కేంద్ర స్థాయిలో స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్, ఉపాధి రంగంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ భద్రత కల్పించడానికి బీసీ యాక్టును పార్లమెంట్లో తీసుకురావాలన్నా రు.

రాష్ట్రంలో కేంద్రంలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27% నుండి 56 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంగిరేకుల ఆదిశేషు, అంగిరేకుల వరప్రసాద్, ష ణ్ముఖం, రాజు, జగదీష్, సురేష్, రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.