22-08-2025 01:33:48 AM
యాదగిరిగుట్ట ఆగస్టు 21 విజయక్రాంతి: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వెలసిన ప్రదేశం యాదగిరిగుట్ట లో నూతన మున్సిపల్ భవనం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతులమీదుగా ప్రారంభించారు. బ్రాహ్మణుల వేదమంత్రాలతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే గారు మరియు ఆలేరు నియోజకవర్గం ముఖ్య నాయకులు , యాదగిరిగుట్ట తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమందర్ గౌడ్ మరియు వార్డ్ కౌన్సిలర్ల సమక్షంలో కార్యక్రమం జరిగింది.
ఎమ్మెల్యే గారి చొరవతో యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయనీ, శతాబ్దాల నిరీక్షణలో యాదగిరిగుట్ట నుండి పాత గుట్టకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, గాంధీ బొమ్మ నుండి యాదగిరిపల్లి వరకు సి.సి రోడ్ పనులు పూర్తయ్యాయని, ఇది కేవలం ఎమ్మెల్యే బీసీ బిడ్డ అవడం ప్రజల బాగోగులు తెలిసినవాడు అవ్వడం వలన సాధ్యమైందనీ ప్రజలు తెలిపారు.