26-08-2025 12:48:24 AM
తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్
మరిపెడ ఆగస్టు 25 (విజయ క్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి కృష్ణ కిషోర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్క గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని, వినాయక మండపం దగ్గర తగు జాగ్రత్తలు వహించాలని, అలాగే ఆన్లైన్లో వినాయక మండపాల గురించి నమోదు చేసుకొని అనుమతులు తీసుకొని వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడే విధంగా చేయకూడదని కమిటీ సభ్యులకు డిఎస్పి సూచించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ గౌడ్, కోటేశ్వరరావు, తహసిల్దార్ కృష్ణవేణి, మరిపెడ మున్సిపల్ కమిషనర్ విజయానంద్, మరిపెడ మైనార్టీ సభ్యులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.