18-08-2025 12:00:00 AM
కామారెడ్డి, ఆగస్టు 17 : (విజయక్రాంతి) : గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని దోమకొండ ఎస్సు స్రవంతి తెలిపారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఎస్ ఐ స్రవం తి పాల్గొని మాట్లాడారు. గణేష్ మండపాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్మించుకోవాలన్నారు. ఉత్సవాలు నిర్వహించే సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల యు వజన సంఘాల సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
మద్నూర్, ఆగస్టు 17 : కామారెడ్డి జిల్లా వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని మద్నూర్ తహశీల్దార్ ఎం.డి. ముజీ బ్ కోరారు. ఆదివారం మండల కేద్రం లోని రైతు వేదికలో గణేశ్ మండపాల సభ్యులతో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సు విజయ కొండ మాట్లాడుతూ.. మండలం లోని గణే ష్ మండపాలను నిర్వహించేవారు శాంతియుతంగా, సామరస్యంగా నిర్వహించాలని సూచించారు.
నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకొని, పోలీసు అధికారుల నిబంధనలు పాటించాలన్నారు. మండ పంలో ఇద్దరు వ్యక్తులు తప్పకుండా ఉండాలని తెలిపారు. విద్యుత్ సదుపాయం కొరకు తప్పనిసరిగా విద్యు త్ అధికారుల అనుమతులు తీసుకోవాలన్నారు. ఉత్సవాలలో డీజే సౌండ్ ఉపయోగించరాదని, మద్యం సేవించరాదని, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి ఒక్కరు పోలీసు అధికారులకు సహకరించాలని, కలిసిమెలిసి శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకో వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో మండల గణేష్ మండప నిర్వాహకులు, గ్రా మ పెద్దలు, పోలీసు సిబ్బంది విద్యుత్, అగ్నిమాపక శాఖ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద కొడప్గల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం
పెద్ద కొడప్గల్, ఆగస్టు 17 : పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని ఆదివారం ఎస్సు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల వినాయక చవితి ఉత్సవం ఉన్నందున వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులు సూచించిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు
ఈ సమావేశంలో పాల్గొ న్న పెద్దలు ఆయా కాలనీలో సమావేశం నిర్వహించి ఎలాంటి అవాం ఛన్య సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి సంవత్సరం అద్భుతంగా ప్రశాంతంగా శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటామని ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా ఆనందంగా జరుపుకోవా లని విజ్ఞప్తి చేశారు
పండగ అనేది మన కుటుంబంతో పాటు మన తోటి వారు కూడా బాగుండాలని భగవంతునికి భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తూ సంబరాలు చేసుకోవడమే దాని ముఖ్య ఉద్దేశం అని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంగారం, మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి ,ఎస్సు అరుణ్ కుమార్, పి ఎస్ సి ఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మాజి కోఆప్షన్ సభ్యులు జాఫర్ షా, బసవరాజ్ దేశాయ్, మైనారిటీ అధ్యక్షులు జమీర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు