calender_icon.png 22 August, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిరప నారుపై గడ్డిమందు గుర్తు తెలియని వ్యక్తులదాష్టీకం

22-08-2025 01:44:31 AM

టేకులపల్లి, ఆగస్టు 21 (విజయక్రాంతి):టేకులపల్లి మండలంలోని దాసుతండా గ్రామానికి చెందిన రైతు బానోత్ శంకర్ కు చెందిన మిరపనారుపై గుర్తుతెలియని వ్యక్తు లు గడ్డి మందు పిచికారీ చేసినట్టు రైతు తెలిపారు. రెండు ఎకరాల సరిపడా మిర్చి 20 ప్యాకెట్ తీసుకొచ్చి నారు చల్లిన ఆ నారు మొత్తం కాలిపోయిందనీ తెలిపారు. కక్ష సాధింపుతో ఇలా చేసి ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కడుపుపై కొట్టడం మంచిది కాదని గ్రామస్తులు తెలిపారు. నిందితులను గుర్తించి న్యాయం చేయాలని బానోత్ శంకర్ వేడుకుంటున్నారు.