calender_icon.png 22 August, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్

22-08-2025 01:43:22 AM

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (రిటైర్డ్) గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ముఖ్యనాయకులు హాజరయ్యారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి కోరారు. ఈ సందర్భంగా, ‘నేను ఏ రాజకీయ పార్టీ వ్యక్తిని కాదు. ఉపరాష్ట్రపతి బాధ్యతలు రాజకీయ బాధ్యతలు కాదు. ఇది స్వయంప్రతిపత్తితో కూడుకున్న పదవి. అందుకే నేను అభ్యర్థిత్వానికి అంగీకరించా’ అని ఆయన తెలిపారు.