calender_icon.png 22 August, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

22-08-2025 12:22:00 AM

  1. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 
  2. సెప్టెంబర్ 6న వేములవాడలో నిమర్జనం వైభవంగా జరిగేలా ఏర్పాట్లు
  3. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 21 (విజయక్రాంతి): ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవా ల ను నిర్వహించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ టెంపుల్ గెస్ట్ హౌస్ సమావేశం మందిరంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహ ణ, నిమర్జన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీగితే లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ సం వత్సరం జరుగనున్నాయని, వీటికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.గత ఏ డాది కంటే ఈ సారి మరింత పెరగ వచ్చునని తెలిపారు. నిమజ్జన సమయంలో ఇ బ్బందులు రాకుండా అవసరమైన పెద్ద క్రే న్లు ముందుగానే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. డీజే, క్రాకర్స్ కు అనుమతి ఇవ్వవద్దన్నారు. నిమర్జనం వద్ద లైటింగ్ త్రాగునీటి సరఫరా, బ్యారికేడ్లు వంటి ఏర్పాట్లు చేయాలని నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రతి పాయింట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, నిమర్జనాన్ని ప్ర త్యేకంగా పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అ ధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చే యాలని సూచించారు.

తదుపరి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ,గణేష్ మం డపాలలోని విగ్రహాలకు జి.పి.ఎస్,జియో ట్యాగింగ్ తో సహా మండపాల వివరాలు అందించాలని అన్నారు. విగ్రహ ర సూచించారు.గణేష్ నిమర్జనం పాయింట్ల వద్ద ప బ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని, మొ బైల్ టాయిలెట్ వంటి సదుపాయాలను క ల్పించాలన్నారు.నిమర్జనం జరిగే రోజు లిక్కర్ షాప్, బెల్టు షాపులు మూసి వేయాలని పేర్కొన్నారు.

నిమజ్జనం సజావుగా జరి గే విధంగా కట్టు దిట్టమైన భద్రత వ్యవస్థ ఏ ర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఎస్పీ మహేష్  మాట్లాడుతూ, నిమర్జ నం సందర్భంగా ప్రతి గణపతి విగ్రహం మండపం నుంచి నిమర్జన పాయింట్ కు తరలించే రూట్ మ్యాప్ ఫైనల్ చేయాలని అ న్నారు. నిమర్జనం సందర్భంగా ఎక్కడా కూ డా వైన్స్ అమ్మడానికి వీలు లేదని, బెల్ట్ షా పుల పట్ల కూడా ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు

క్షేత్రస్థాయిలో గుడి చెరువు పరిసరాలను పరిశీ లించి ఏర్పాట్ల పై తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో ఆలయ ఈ వో రాధాబాయి జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య జిల్లా ఫైర్ సర్వీసెస్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆర్ అండ్ బి, సెస్ అధికారులు మున్సిపల్ కమిషనర్ అన్వేష్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.