27-08-2025 02:10:17 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): భక్తి శ్రద్దలతో గణేష్ ఉత్సవాలను కులాలకు అతీతంగా ప్రజలు ఐక్యంగా జరుపుకొని ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించా లని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. మంగళవారం భోలక్ పూర్ డివిజన్ లోని భోలక్ పూర్ హౌస్ వద్ద డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా ప్రభుత్వ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూ చించారు.
నియోజకవర్గంలో పెద్ద ఎత్తు న మండపాలను ఏర్పాటు చేసి అలంకరిస్తూ ఉత్సవా నిర్వాహకులు మతసామరస్యాన్ని పెంపొందిస్తున్నారు. అన్నారు. ఈ కార్యక్రమంలో భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, ఆర్. శ్రీనివాస్, యూత్ కమిటీ డివిజ న్ అధ్యక్షుడు సాయికుమార్, సంయుక్త కార్యద ర్శులు గోవింద్ రాజ్, కృష్ణ, సోషల్ మీడియా ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సంజీవ్ నగర్ లో మట్టి వినాయకులను సోషల్ మీడియా ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణనాథులను పూజించాలని ప్రచారం చేశారు.