calender_icon.png 27 August, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు

27-08-2025 02:12:36 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81 141 సిఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు సమక్షంలో వారు లొంగిపోయినట్టు తెలిపారు.

మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయుట కార్యక్రమం ద్వారా ఆకర్షితులై ఆయుధాలను వేడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్ల లో ఒక మహిళా సభ్యురాలు, ఏడుగురు పురుషులు ఉన్నట్టు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 314 మంది మావోయిస్టు దళ సభ్యులు వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన వారు లొంగిపోయినట్టు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆదివాసుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఆదివాసి ప్రాంతాల్లో రోడ్లు పాఠశాలలో వైద్యశాలలు తాగునీరు విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఐదుగురు మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది పనిచేస్తున్నట్టు తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులకు తక్షణ సహాయం గా ప్రతి ఒక్కరికి రూ 25 వేల చొప్పున, మొత్తం రూ 2 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి వారి ర్యాంకుల వారీగా మిగతా నగదును ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ ద్వారా వారి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.